HomeTelugu Trendingమంచు లక్ష్మి కుమార్తె పాడిన 'అయిగిరి నందిని...' నెటిజన్ల ప్రశంసలు.. వీడియో

మంచు లక్ష్మి కుమార్తె పాడిన ‘అయిగిరి నందిని…’ నెటిజన్ల ప్రశంసలు.. వీడియో

4 20
మంచువారి అమ్మాయి లక్ష్మి.. నటిగా, యాంకర్ గానూ తనదైన శైలిలో రాణిస్తుంది. ఆమె కుమార్తె, విద్యా నిర్వాణ తానేమీ తల్లికి తక్కువేమీ కాదని నిరూపించుకుంది. చిన్న వయసులో ఈ మధ్య యూట్యూబ్ లో అడుగుపెట్టి ‘చిట్టి చిలకమ్మా…’ అంటూ పలకరించిన విద్య, మహా శివరాత్రి సందర్భంగా ‘అయిగిరి నందిని…’ అంటూ పాడిన స్తోత్రాన్ని మంచు లక్ష్మి షేర్ చేసింది.

ఇక ఈ వీడియో వైరల్ కాగా, చూసిన వారంతా విద్యా నిర్వాణ తొలిసారిగా పాడుతున్నట్టు లేదని, అద్భుత ప్రతిభ ఆమె సొంతమని కితాబిస్తున్నారు. పాటలో వేరియేషన్స్ చూపిస్తూ, హావభావాలను ఆమె పలికించిన తీరు ఎంతగానో నచ్చిందని మెచ్చుకుంటున్నారు. ఇక ఈ పాట రికార్డింగ్ అనంతరం మంచు లక్ష్మి తన కుమార్తెను కౌగిలించుకుని, ముద్దాడుతూ ఆనందబాష్పాలు రాల్చింది. ఈ శివరాత్రి తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని ఈ సందర్భంగా మంచు లక్ష్మి వ్యాఖ్యానించింది. ఈ వీడియో మీ కోసం..

Recent Articles English

Gallery

Recent Articles Telugu