మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలపై మంచు లక్ష్మి స్పందించింది. తమ్ముడు మనోజ్‌కు తన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందంటూ పెళ్లిపై పరోక్షంగా స్పష్టత ఇచ్చింది. తన పుట్టిన రోజు సందర్భంగా లక్ష్మి ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా మనోజ్ పెళ్లి గురించి ఆడిగిన ప్రశ్నకు ఎవరి బతుకు వాళ్లకు బతకనివ్వండి అంటూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ రోజుల్లో నిస్వార్థమైన, నిజాయితీతో కూడిన ప్రేమను పొందడం చాలా కష్టమని చెప్పింది. ఇప్పుడు మనోజ్ అలాంటి ప్రేమను పొందుతున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపింది.
మంచు మనోజ్ గతంలో ప్రణతీరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ, 2019తో ఆమెతో విడిపోయినట్టు ప్రకటించాడు. ఇటీవలే మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు ఎక్కువయ్యాయి. ఏపీ మాజీ మంత్రి, టీడీపీకి చెందిన భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనికారెడ్డిని మనోజ్ పెళ్లి చేసుకుంటాడన్న పుకార్లు వచ్చాయి. అంతేకాక ఇటీవల ఓ వినాయక మండపంలో మనోజ్, మౌనికారెడ్డి కనిపించారు. దీంతో వార్తలు మరీంత ఎక్కువైయ్యాయి.