HomeTelugu Trendingతాప్సీని పొగడ్తలతో ముంచెత్తిన మంచు లక్ష్మి

తాప్సీని పొగడ్తలతో ముంచెత్తిన మంచు లక్ష్మి

9 6

మంచువారి అమ్మాయి నటి మంచు లక్ష్మి, హీరోయిన్‌ తాప్సీ మంచి ఫ్రెండ్స్‌ అనే సంగతి తెలిసిందే. మంచు లక్ష్మి నిర్మించిన ‘ఝమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది సొటబుగ్గల సుందరి తాప్సీ. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘తప్పడ్’ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాతో తాప్సీని పొగడ్తలతో ముంచెత్తింది మంచు లక్ష్మి.

‘మై డార్లింగ్ తాప్సీ. నేను నీకు అభిమాని కావటానికి చాలా కారణాలున్నాయి. ఇలాంటి అద్బుతమైన చిత్రంలో నటించిన నీకు, మిగిలిన నటీనటులు మరింత శక్తి వస్తుంది. 2 వారాల క్రితం తప్పడ్ సినిమా చూశాను. భారతీయ సమాజంలోని ఓ కమ్యూనిటీ నుంచి వచ్చిన మహిళగా.. నేను చెప్పిన ప్రతీ అంశంపై అసలు ఏం చేయాలి..? ఏం చేయకూడదంటూ అనేక ప్రశ్నలు రేకెత్తించేలా ఈ చిత్రం ఉందని ట్వీట్ లో పేర్కొంది. దీనికి తాప్సీ రీట్వీట్ చేస్తూ..వావ్ నీ సాయంతో నేను ప్రయాణం మొదలు పెట్టిన పదేళ్ల తర్వాత నిన్ను గర్వించేలా చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ క్షణం అన్నింటి కంటే ప్రత్యేకమైనదని ప్రతీ ఒక్కరికీ తెలుసు. పెద్ద హగ్.. లవ్ ఎమోజీ ని పెట్టింది తాప్సీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu