నటి మంచు లక్ష్మి మరోసారి వివాదాల్లో ఇరుక్కుంది. ఈమె ఏం చేసినా కూడా ఎక్కడో ఓ చోట కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అవుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఇలాంటి వివాదంలోనే ఇరుక్కుంది మంచు లక్ష్మి. ఈ మధ్య సినిమాలు కాస్త తగ్గించిన లక్ష్మి.. వెబ్ సిరీస్‌ల వైపు చూస్తుంది. మధ్యలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కాలం గడిపేస్తుంది. అయితే తాజుగా సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కూడా అతిథి పాత్రలో మెరిసింది మంచు లక్ష్మి. ఈ మధ్యే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.
ఇందులో మంచు లక్ష్మి కూడా కనిపించింది. సినిమా గురించి.. సమంత గురించి మాట్లాడింది. అక్కడితో ఆగకుండా సినిమాలో ఉన్న ఓ డైలాగ్ కూడా ప్రేక్షకుల కోసం చెప్పింది. ఇదే ఇప్పుడు ఈమెకు తిప్పలు తీసుకొచ్చింది. ఓ బేబీ ట్రైలర్లో నీకు ఎలాంటి మొగుడు కావాలంటే.. అందంగా ఉండాలి.. డబ్బులుండాలి.. మంచమెక్కితే మగాడిలా కాపురం చేయాలంటూ ఓ డైలాగ్ చెబుతుంది. ఇదే డైలాగ్ వేడుకలో కూడా చెప్పింది.
ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఎంత సినిమాలో ఉన్న డైలాగ్ అయినా కూడా అంత పచ్చిగా మంచమెక్కితే మగాడిలా కాపురం చేయాలంటూ ఎలా చెప్తారంటూ ఆమెపై మండి పడుతున్నాయి మహిళా సంఘాలు. వెంటనే ఈమె క్షమాపణ చెప్పాలంటున్నారు వాళ్లు. మొత్తానికి తన ప్రమేయం లేకుండానే వివాదంలో ఇరుక్కుంది.
అంతే కాక ఈ చిత్రంలో నటించిన సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌ను పొగడ్తల వర్షంలో ముంచెత్తే ప్రయత్నంలో ‘మీరు నటించిన జంబలకిడిపంబ చిత్రం వెయ్యిసార్లుగా పైగా చూసి.. ఆ క్యాసెట్ అరగ్గొట్టేశాం’ అంటూ కాస్త ఎక్కువ చేసి మాట్లాడారు. అదేంటి..? ‘జంబలకిడిపంబ’ చిత్రంలో హీరో నరేష్ కదా.. మరి రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు నటించాడబ్బా.. అమ్మా మంచులక్ష్మీ కాస్త తెలుసుకుని స్పీచ్‌లు ఇవ్వవమ్మా అంటూ నెటిజన్లు ట్రోల్స్ మొదలు పెట్టారు.
ఈ ట్రోలర్స్‌కి వంత పాడుతూ.. ప్రముఖ నటి శ్రీరెడ్డి.. మంచులక్ష్మిపై సెటైర్లు పేల్చింది. తన ఫేస్ బుక్ ద్వారా మంచు లక్ష్మిని ‘ఇంగ్లీష్ పుత్రీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు వదిలింది. ‘మంచులక్ష్మి జీ.. ‘జంబలకిడిపంబ’ హీరో రాజేంద్రప్రసాద్ గారు కాదమ్మా… పొగడకపోయినా పర్లేదు అవమానించకమ్మా’ అంటూ ఫేస్ బుక్ పోస్ట్ వదిలింది శ్రీరెడ్డి.