నటి మంచు లక్ష్మీ రక్తం కారేలా గాయాలయ్యాయని, చేతి వేళ్లకు కూడా దెబ్బలు తగలడంతో రక్తం వచ్చిందని మంచు లక్ష్మీ ఆదివారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దీంతో మంచు లక్ష్మీకి అసలు ఏమైందంటూ అభిమానులు ఆరా తీయడం ప్రారంభించారు. అయితే రియల్ యాక్సిడెంట్ కాదనిస రీల్ యాక్సిడెంట్ అని తెలుస్తోంది.
ప్రస్తుతం మంచు లక్ష్మీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న సినిమాల్లో మలయాళం మూవీ కూడా ఉంది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్న ఓ సినిమాలో మంచు లక్ష్మీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో ఆమెకు ఫైట్ సీన్స్ కూడా ఉంటాయట. ఈ సందర్భంగా సినిమా చిత్రీకరణ సమయంలో వేసిన మేకప్‌ను ఫోటోలు తీసి మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నిజంగానే ఆమెకు యాక్సిడెంట్ అయ్యిందని సినీ అభిమానులు కంగారు పడ్డారు. బాగున్నారా? ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటూ పలువురు ఆమెకు సందేశాలు పంపారు. దీంతో స్పందించిన మంచు లక్ష్మీ ..ఓకే, ఓకే నా ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన రక్తం ఉన్న ఆ చెయ్యి, మోకాలి ఫొటోలు ఓ షూటింగ్‌లోనివి. రియల్ యాక్సిడెంట్ కాదు. చాలా మంది ప్రజలు నా గురించి ఆలోచిస్తారని తెలిసి చాలా సంతోషం వేసింది. లవ్ యు ఆల్’ అని అసలు విషయం బహిర్గతం చేసింది.