టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు కూతురు, నటి, నిర్మాత మంచు లక్ష్మి కొవిడ్ బారిన పడ్డారు. సోషల్ మీడియా వేదికగా తానే ఈ విషయాన్ని తెలిపారు. బూచోడులాంటి కరోనా నుంచి రెండేళ్లుగా తప్పించుకున్నానని, చివరికి దాని బారిన పడ్డానని వివరించారు. కొవిడ్ నుంచి త్వరగా బయటపడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలని కోరారు.
‘కరోనా సాధారణ జలుబులా అందరినీ ఎటాక్ చేస్తోంది. దాంతో మనం పోరాడేందుకు మన వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. మంచి ఆహారం తీసుకోండి. ప్రశాంతంగా ఉండండి. వ్యాక్సిన్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ఇప్పటికే రెండు సార్లు కొవిడ్ టీకా తీసుకునుంటే బూస్టర్ డోసు కోసం ప్రయత్నించండి’ అని విజ్ఞప్తి చేశారు. వినోదం కోసం మంచి సినిమాలు, కార్యక్రమాలు, పాడ్కాస్ట్ల వివరాలు పంపించండంటూ అభిమానుల్ని కోరారు.
It’s going to affect everybody and get all of us just like a common cold. What we need to do is take care of our immunity and make sure our bodies are strong enough to fight the virus. So don’t forget to take your vitamins and keep your mind and body in check. pic.twitter.com/cs5x0Rhewd
— Lakshmi Manchu (@LakshmiManchu) January 6, 2022