అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ‘చి.ల.సౌ’ ఫేమ్ రుహానీ శర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్ కథను అందించాడు. దిల్ రాజు, క్రిష్ జాగర్లమూడి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శిరీష్, వై.రాజీవ్ రెడ్డి , సాయిబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. . తాజాగా ‘101 జిల్లాల అందగాడు’ నుంచి ‘మనసా వినవా’ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. శ్రీరామ్ చంద్ర, ధన్య బాలకృష్ణ ఈ సాంగ్ ను ఆలపించగా… భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. శక్తికాంత్ కార్తిక్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం మే 7న విడుదల కానుంది.