HomeTelugu ReviewsManamey review and rating: మనం చూసే అంటేమి లేదు

Manamey review and rating: మనం చూసే అంటేమి లేదు

Manamey 1 Manamey

Manamey review and rating

నటీనటులు: శర్వానంద్, కృతి శెట్టి, విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, అయేషా ఖాన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి

దర్శకుడు: శ్రీరామ్ ఆదిత్య

నిర్మాత: T.G. విశ్వ ప్రసాద్

సంగీత దర్శకుడు: హేషమ్ అబ్దుల్ వహాబ్ సినిమాటోగ్రాఫర్‌లు: విష్ణు శర్మ, జ్ఞానశేఖర్ వి.ఎస్. ఎడిటర్: ప్రవీణ్ పూడి

శర్వానంద్, కృతి శెట్టి ఇద్దరికీ మంచి విజయం ఎంతో అవసరం. ఇక వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం మనమే.. ఈరోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం..

కథ: ఎటువంటి బాధ్యత లేకుండా తిరిగే విక్రమ్(శర్వానంద్)  అనుకోకుండా తన స్నేహితుడి కుటుంబం చనిపోవడంతో..తన స్నేహితుడి కొడుకుని చూసుకోవాల్సిన బాధ్యత వచ్చి పడుతుంది. ఇక స్నేహితుడి భార్య స్నేహితురాలు సుభద్ర(కృతి శెట్టి)తో కలిసి లండన్ లో ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అసలు బాధ్యతలు అంటేనే అసలు నచ్చని.. విక్రమ్ అయిష్టంగానే బాబు(విక్రమ్ ఆదిత్య)ను చూసుకునేందుకు సరే అంటారు.. అలాంటి విక్రమ్ ఆ బాబుని వదులుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చాడు? అసలు ఆ బాబు పైన ఎందుకు ప్రేమ పంచుకున్నారు? ఆ బాబుని చంపాలని ఎవడు ప్రయత్నించారు? వారి బారి నుంచి ఎవరు కాపాడారు?  అనేది మిగిలిన కథ.

నటీనటుల పర్ఫామెన్స్, టెక్నికల్ సిబ్బంది పనితీరు: నటీనటుల విషయానికి వస్తే ఈ చిత్రంలో శర్వానంద్ ఇప్పటివరకు చేసిన పాత్రలకు చాలా భిన్నంగా ఒక ప్లే బాయ్ తరహా క్యారెక్టర్ లో కనిపించి.. అందరినీ ఆకట్టుకున్నాడు. శర్వానంద్ నటన పరంగా ఈ సినిమాలో వందకి వంద మార్కులు వేయొచ్చు. ఇక కృతి శెట్టి యాక్టింగ్ కూడా ఈ సినిమాలో బాగుంది. ఖుషి అనే చిన్న బాబు పాత్రలో కనిపించిన విక్రం ఆదిత్య చాలా బాగా చేశాడు.

ఇక మిగతా క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకునే అవసరం లేదు. రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, సుదర్శన్ లాంటివాళ్ళు ఉన్నా పూర్తి స్థాయిలో వాడుకోలేదు.

ఇక టెక్నికల్ సిబ్బంది పనితీరు విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ ని ఒక పెయింటింగ్ లాగా కలర్ఫుల్ సీనరీతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు సినిమాటోగ్రాఫర్. హేషం సంగీతం పరవాలేదు. ఇక నిర్మాణ విలువలు చాలా బాగున్నప్పటికీ ఈ చిత్రం ఎడిటింగ్ మాత్రం అంతగా మెప్పించదు.

విశ్లేషణ: ఇలాంటి కథలను మనం ఇంతకముందే ఎన్నో తెలుగు సినిమాలలో చూసాం. కానీ ఈ సినిమాను ట్రెండ్ కి తగినట్లు డిజైన్ చేసుకున్నాడు డైరెక్టర్. అనాధ అయిన హీరో ఫ్రెండ్ తన భార్యతో ప్రమాదంలో చనిపోతే ఆ వారి కుమారుడిని కొన్నాళ్ల పాటు సంరక్షించాల్సిన బాధ్యత హీరో పైన పడుతుంది. అసలు ఏమాత్రం ఇష్టం లేకుండానే తన వైబ్ కి అసలు ఏ మాత్రం సెట్ అవ్వని సుభద్ర అనే అమ్మాయితో కొన్ని రోజులపాటు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అలాంటి క్రమంలో వారిద్దరి మధ్య వచ్చే సరదా గిల్లికజ్జాలను ఎంగేజింగ్ తెరమీదకు తీసుకురావడంలో డైరెక్టర్ మరీ రొటీన్ ఫార్ములా పాటించారు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే చాలా బాగున్న.. దర్శకుడు రాసుకున్న సన్నివేశాల వల్ల.. మనకు ఎక్కడా కూడా సినిమా అద్భుతంగా అయితే అనిపివ్వదు. ఫస్ట్ హాఫ్ ఏదో ఒక విధంగా సాగిపోతుంది.

అసలు సమస్య మొత్తం సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది. ఇలాంటి సినిమాల్లో ఎంతో అవసరమైనది ఎమోషన్స్. కానీ ఆ ఎమోషన్స్ ఎక్కడ కూడా అంత గొప్పగా లేవు. సెకండ్ హాఫ్ లో త్వరగా ముగించేయాల్సిన చాలా విషయాల్ని.. సాగదీసిన ఫీలింగ్ కలిగితే ఆశ్చర్యం లేదు.

తీర్పు: మనమే..మనం అనుకున్నంత అయితే ఏమీ లేదు

Rating: 2/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu