
Manamey OTT release date:
శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన ‘మనమే’ సినిమా ఎప్పటి నుంచో OTTలో రావాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ, సినిమా రిలీజై ఎనిమిది నెలలు అయినా కూడా ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందనే విషయం క్లారిటీ రాలేదు. ఇప్పుడు ఫైనల్‌గా గుడ్ న్యూస్ వచ్చింది!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించినట్టుగా, అమెజాన్ ప్రైమ్ వీడియో ‘మనమే’ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. అయితే, స్ట్రీమింగ్ తేదీ ఇంకా వెల్లడించలేదు. అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ప్రకారం, మరో వారం లేదా పది రోజుల్లో సినిమా ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.
#Manamey will premiere soon, mostly in March, on Amazon Prime! pic.twitter.com/Krup2THUwx
— Movie Mahal (@moviemahaloffl) March 3, 2025
‘మనమే’ ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా, దీనికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు. సినిమాలో శర్వానంద్, కృతి శెట్టితో పాటు ఆయేషా ఖాన్, రాజ్ కందుకూరి, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, తులసి, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా మ్యూజిక్ హేషామ్ అబ్దుల్ వహాబ్ అందించగా, TG విశ్వ ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించారు. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ హిట్ కాకపోయినా, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది.
సాధారణంగా సినిమాలు నెలరోజుల్లోనే OTTలోకి వచ్చేస్తాయి. కానీ ‘మనమే’ మాత్రం ఎనిమిది నెలల పాటు ఓటీటీలో కనిపించలేదు. దీనికి గల కారణాలపై స్పష్టత లేకపోయినా, ఆడియో, డిజిటల్ హక్కులపై ఒప్పందాలు ఆలస్యం కావడం కారణంగా ఇలా జరిగిందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా, థియేటర్‌లో మిస్ అయిన వారు తప్పక చూడవచ్చు. మరి విడుదల తేదీ కోసం వెయిట్ చేద్దాం!