HomeTelugu TrendingMamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎంకి తీవ్ర గాయం.. ఆసుపత్రికి తరలింపు

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎంకి తీవ్ర గాయం.. ఆసుపత్రికి తరలింపు

Mamata Banerjee suffers maj

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆమె తలకు గాయమైంది. నుదుటి నుంచి రక్తం కారింది. దీంతో మమతా బెనర్జీని వెంటనే కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) పార్టీ ఈ విషయాన్ని ఎక్స్‌లో వెల్లడించింది. తమ పార్టీ చీఫ్‌ తలకు గాయమైనట్లు తెలిపింది. అలాగే మమతా బెనర్జీ నుదుటి నుంచి రక్తం కారుతున్న ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆమె ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది. అయితే గాయానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ముఖ్యమంత్రి వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరిలోనూ ఓ కారు ప్రమాదంలో మమతా తలకు స్వల్ప గాయమైంది. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం బర్ధమాన్‌ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా.. ఆమె కాన్వాయ్‌కు ఎదురుగా ఉన్నట్టుండి మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్‌ కారుకు బ్రేక్‌లు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం.. విండ్‌షీల్డ్‌కు ఢీకొనడంతో తలకు స్వల్ప గాయమైనట్టు అధికారులు వెల్లడించారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu