బాలీవుడ్ నటి మల్లికా శరావత్ ఓ షాకింగ్ విషయం బయట పెట్టింది. ఇప్పుడు అది స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తున్న బూ.. సబ్కీ ఫటేగీ అనే చిత్రంలో మల్లిక కీలక పాత్రను పోషిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా మల్లిక, ఏక్తా కపూర్.. ది కపిల్ శర్మ షో లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో హాస్యనటుడు కపిల్ శర్మ.. మల్లికను ఓ ప్రశ్న అడిగారు. చపాతీలు వేడిగా ఉండటానికి వాటిని పత్రికల్లో కనిపించే హీరోయిన్ల పోస్టర్లలో చుడతారట కదా? అని ప్రశ్నించారు.
ఇందుకు మల్లికా స్పందిస్తూ.. ఆ విషయం నాకు తెలీదు కానీ.. ఓ నిర్మాత నుంచి నేను ఎదుర్కొన్న సంఘటన మీతో చెబుతాను.. ఓ సినిమాలో నా అందాన్ని చూపించడానికి నా నడుము, పొట్ట భాగాన్ని హైలైట్ చేయాలనుకున్నారు. నా పొట్టపై కోడిగుడ్లు పెట్టి ఓ సన్నివేశాన్ని షూట్ చేయాలనుకున్నారు. ఈ విషయం నిర్మాత నాకు చెప్పగానే కచ్చితంగా చేయలేనని చెప్పేశాను అంది. అయితే మల్లిక కోపిష్టి అని ప్రచారం చేశారని, సినిమాల్లో అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి తొలగించే వారని వెల్లడించింది. అలా దాదాపు 30 చిత్రాలు చేజార్చుకున్నట్లు తెలిపింది. తనను తొలగించి ఆ స్థానంలో పలువురు హీరోలు తమ ప్రియురాళ్లకు అవకాశాలు ఇచ్చుకునేవారని ఆరోపించారు.