జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన రాక్షసి సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సరిగా చదవని పిల్లల పట్ల టీచర్లు ఎలా వ్యవహరించాలి.. వాళ్లను ఎలా మంచిమార్గంలో పెట్టాలి అనే విషయాలను చక్కగా చూపించారు. విద్యాలయాలు చక్కగా నడవాలంటే ఎలాంటి పథకాలు ఉండాలి, వాటిని ఎలా అమలు చేయాలనే విషయాలను చక్కగా చిత్రీకరించారు. టీచర్ పాత్రలో జ్యోతిక అలరించింది.
ఈ సినిమాను ఇటీవలే మలేషియా విద్యాశాఖ మంత్రి మస్ జ్లి మాలిక్ చూశారట. అతనికి సినిమా చాలా బాగా నచ్చిందట. ఈ సినిమాను చూసి విద్యాశాఖ మంత్రిగా అర్ధం చేసుకొని, దానికి తగ్గట్టుగా రివ్యూ ఇవ్వాలని అనుకున్నారట. విద్యావ్యవస్థలో మార్పు తీసుకురావడం పెద్ద విషయం కాదు. దానికోసం సరైన పధకాలు ప్రవేశపెట్టాలి. వాటిని కరెక్టుగా అమలు జరిగేలా చూడాలి. అప్పుడే మార్పు వస్తుంది. పిల్లలతో టీచర్లు ప్రవర్తించే తీరును బట్టికూడా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావొచ్చు. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రుల సహకారం కూడా కావాలి. పిల్లలు ఎలా చదువుతున్నారు.. ఏం చేస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సినిమాలో చూపించినట్టు మలేషియా విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు.