ఆస్కార్ 2024 అవార్డుల కోసం భారత్ నుంచి మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 2018 సినిమా ఎంపికైంది. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో 2018 మూవీని ఎంపిక చేశారు.
2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2018 చిత్రాన్ని తమిళంలో టోవినో థామస్ ప్రధాన పాత్రలో జూడ్ ఆంథోనీ జోసెఫ్ రూపొందించారు. అత్యంత భావోద్వేగ భరితంగా రూపొందించిన ఈ సినిమా మలయాళ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల్లోని సినీ ప్రేక్షకులను కంటతడి పెట్టించింది.
2018 మూవీ బాక్సాఫీసు వద్ద 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 17 మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ మొత్తం 22 సినిమాలను వీక్షించి చివరకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం కేటగిరీ కోసం 2018 సినిమాను ఎంపిక చేసింది.
బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన లగాన్ చిత్రం తర్వాత ఇప్పటివరకు భారత్ నుంచి ఏచిత్రమూ ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం కేటగిరీకి బరిలో చివరి వరకూ నిలవలేదు.