ప్రముఖ మలయాళ దర్శకుడు అశోకన్ (60) అనారోగ్యంతో కన్నుమూశారు. దీర్ఘకాలీక వ్యాధితో బాధపడుతున్న ఆయన కోచిలోని ఓ ప్రేవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందితూ.. ఆదివారం మృతి చెందారు. 1989లో వర్ణం అనే సినిమాలో ఆయన ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఆయన అసలు పేరు రామన్ అశోక్ కుమార్. కామెడీ చిత్రాలు ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చింది. 2003 లో ఆయన సింగపూర్‌కి షిఫ్ట్ అయ్యారు. అక్కడ వ్యావపారంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే ఆయన ,చెన్నైకు తిరిగి వచ్చారు. ఆయనకు భార్య, ఒక కుమారై ఉన్నారు.