Malaika Arora father death:
బాలీవుడ్ లో ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్లలో Malaika Arora కూడా ఒకరు. సినిమాలతో కంటే.. సోషల్ మీడియాలో ఫోటోల కారణంగా ఎక్కువ పాపులర్ అయిన ఇంటి మీద ఇప్పుడు విషాదఛాయలు అలుముకున్నాయి. మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు.
మలైకా అరోరా, అమృతా అరోరాల తండ్రి అనిల్ అరోరా ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో, నటుడు, నిర్మాత, మలైకా మాజీ భర్త అర్బాజ్ ఖాన్ మలైకా కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. మలైకా కుటుంబ నివాసం వద్ద పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు కనిపించారు.
#WATCH | Maharashtra | Anil Arora, father of actress-model Malaika Arora died by suicide by jumping off the terrace of their residence in Mumbai. Police team is present at the spot and is carrying out investigation. Details awaited. pic.twitter.com/QKBDKWOsdI
— ANI (@ANI) September 11, 2024
మలైకా అరోరా తల్లిదండ్రులు ఆమె 11 ఏళ్ళ వయసులోనే విడిపోయారు. తర్వాత మలైకా, ఆమె తల్లి జాయిస్ పోలికార్ప్, చెల్లెలు అమృతా కలిసి చెంబూర్‌కు వెళ్లారు. మలైకా తల్లి జాయిస్ పోలికార్ప్ మలయాళి క్రిస్టియన్ కాగా, ఆమె తండ్రి అనిల్ అరోరా పంజాబీ హిందువు, ఇండియన్ మర్చంట్ నేవీలో పనిచేసేవారు.
గత ఏడాది ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మలైకా, “నా తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత నా తల్లిని కొత్త కోణంలో చూడగలిగాను. ఆమె నాకు గొప్ప వ్యక్తిత్వాన్ని నేర్పించింది. ఉదయాన్నే లేచి, ఏమైనా చేయడానికి సిద్ధపడటం, స్వతంత్రంగా ఉండటం ఎలాగో నేర్చుకున్నాను. ఇవన్నీ నా వ్యక్తిగత, వృత్తి జీవితంలో సూత్రాలుగా పాటిస్తాను. నా స్వేచ్ఛకు ఎంతో విలువ ఇస్తాను” అని అన్నారు.
అమృతా అరోరా 2009లో వ్యాపారవేత్త షకీల్ లదాక్‌ని వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా 19 సంవత్సరాలు కలిసి వివాహంలో ఉన్నారు. కానీ 2016లో విడిపోయారు, 2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం అర్బాజ్, మేకప్ ఆర్టిస్ట్ శురా ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. మలైకా బాలీవుడ్ స్టార్ అర్జున్ కపూర్‌తో కొన్నాళ్ళు డేటింగ్ చేసి ఈమధ్యనే విడిపోయారు.