ప్రముఖ నటుడు కమల్‌హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న భారతీయుడు-2 సినిమా షూటింగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో సెట్ వేస్తుండగా ప్రమాదం జరిగింది. 150 అడుగుల క్రేన్ ఒక్కసారిగా తెగిపడటంతో ముగ్గురు మృతిచెందగా, మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. దర్శకుడు శంకర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ(34), ప్రొడక్షన్ అసిస్టెంట్లు మధు(29), చంద్రన్(60) మృతిచెందినట్టుగా గుర్తించారు. గాయపడ్డవారిని సమీపంలోని సవిత మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2లో కమల్ హాసన్‌తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ ఇతర పాత్రలు చేస్తున్నారు.