టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘జయం’ సినిమా హీరోగా నితిన్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలోని ‘రాను రానంటూనే చిన్నదో’ అనే పాట ఎంత సూపర్ హిట్ అందరికీ తెలిసిందే. తాజాగా ఈ పాటకు అనుగుణంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నితిన్ ‘వావ్’ అంటూ కామెంట్ చేశాడు.
అయితే ఈ పాటకు మహేశ్ బాబు నిజంగా స్టెప్పులు వేయలేదు. ఇదంతా కేవలం ఎడిటింగ్‌తో చేసిన ప్రయోగం. నితిన్ తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో ‘రారా రెడ్డి’ స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్ అంజలి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట చివర్లో ‘రాను రానంటూనే చిన్నదో’ సాంగ్‌ను రీమిక్స్ చేసి జోడించారు. ఇప్పుడు ఈ రీమిక్స్‌కు అనుగుణంగా ‘సర్కారు వారి పాట’లోని ‘మ.. మ.. మహేశా’ స్టెప్పులతో ప్రత్యేకంగా వీడియో క్రియేట్ చేశాడు ఓ నెటిజన్. ఈ స్పెషల్ వీడియోను ట్విటర్‌లో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నితిన్ ‘వావ్.. సూపర్.. పర్‌ఫెక్ట్ సింక్’ అంటూ కామెంట్ చేశాడు.
Wowww!! SUPERB and PERFECT SYNC 🔥🔥 https://t.co/KvXrbnzo7t
— nithiin (@actor_nithiin) July 12, 2022