టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నెల 9న పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులకు కీలక సూచన చేశాడు. ‘ప్రియమైన అభిమానులకు.. మీరందరూ నాకు తోడుగా ఉండడం నా అదృష్టం. నా పుట్టినరోజు, ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తుండాలని మీరు చేస్తోన్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపాడు. ‘అందుకు మీ అందరినీ అభినందిస్తున్నాను. ప్రస్తుతం కరోనాతో మనమందరం చేస్తోన్న ఈ యుద్ధంలో సురక్షితంగా ఉండడం అనేది అన్నిటికంటే ముఖ్యం. నా పుట్టినరోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ మహేష్ బాబు’ అని ఆయన ఓ ప్రకటన చేశాడు.
A kind request to all my fans 🙏🏻 pic.twitter.com/UnAzeYPUBQ
— Mahesh Babu (@urstrulyMahesh) August 7, 2020