HomeTelugu Trendingఅఖిల్‌ 'ఏజెంట్' సినిమాపై మహేష్‌ ట్వీట్

అఖిల్‌ ‘ఏజెంట్’ సినిమాపై మహేష్‌ ట్వీట్

Maheshbabu praises Akhil ag

అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’. సురేంద‌ర్ రెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. హాలీవుడ్‌లో లెవల్ స్టంట్స్‌తో టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంది. తాజాగా ఈ టీజ‌ర్‌పై సూపర్‌ స్టార్‌ మ‌హేష్ బాబు ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు.

‘ఏజెంట్ టీజ‌ర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, థీమ్ చాలా బాగున్నాయి. చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అంటూ మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. దీనిపై అఖిల్ స్పందించి ‘థాంక్యూ బ్ర‌ద‌ర్‌, మీ స‌పోర్ట్‌, ప్రోత్సాహం చాలా విలువైన‌ది’ అంటూ రీట్వీట్ చేశాడు. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ యూట్యూబ్‌లో మిలియ‌న్స్ వ్యూస్‌ను సాధించింది. అంతేకాకుండా టైర్‌2 హీరోల‌లో అత్య‌ధిక లైక్స్ వచ్చిన టీజ‌ర్‌గా ఏజెంట్ నిలిచింది. అంటే సుంద‌రానికీ త‌ర్వాత 24గంట‌ల్లో అత్య‌ధిక వ్యూస్ వ‌చ్చిన టీజ‌ర్‌గా కూడా నిలిచింది. మ‌ల‌య‌ళ స్టార్ మమ్ముట్టి కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ఏ.కే ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌తో క‌లిసి సురేంద‌ర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu