టాలీవుడ్ హాస్యనటుడు మహేశ్ విట్టా ఒక ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి శ్రావణి రెడ్డితో ఆయన వివాహం ఘనంగా జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక ఫంక్షన్ హాల్ లో వీరి వివాహం జరిగింది. వీరి వివాహానికి బిగ్ బాస్ సీజన్-3లో పాల్గొన్న కొందరు కంటెస్టెంట్లు హాజరయ్యారు. మహేశ్ విట్టా యూట్యూబర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత కొంత కాలంలోనే కామెడీ షోతో టీవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొన్నాడు. బిగ్ బాస్ హౌస్ లో 60 రోజులకు పైగా ఉండి గుర్తింపును తెచ్చుకున్నాడు. చిత్తూరు జిల్లా యాసతో పలు సినిమాల్లో ఆయన ఆకట్టుకున్నాడు. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘శమంతకమణి’, ‘టాక్సీవాలా’, ‘చలో’, ‘కొండపొలం’, ‘అల్లుడు అదుర్స్’ తదితర చిత్రాల్లో నటించాడు.