HomeTelugu Newsమేరీకోమ్‌కు అభినందనలు తెలిపిన మహేష్‌

మేరీకోమ్‌కు అభినందనలు తెలిపిన మహేష్‌

3 25ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో చరిత్ర సృష్టించిన భారత బాక్సర్ మేరీకోమ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోసారి స్వర్ణ పతకాన్ని సాధించి.. ఆ ఘనతను సాధించిన తొలి మహిళా బాక్సర్‌గా చరిత్రకెక్కిన ఆమెను రంగాలకతీతంగా అభినందనలతో ముంచెత్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు.. మేరీ కోమ్‌ను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశాడు. ‘అద్భుత విజయం ఛాంపియన్. నీ విజయాన్ని చూసి గర్విస్తున్నాం. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో ఆరు స్వర్ణాలు గెలుపొందిన నీకు నా అభినందనలు’ అని పోస్ట్‌ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu