టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన కూతురుతో గడిపిన క్షణాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో రోజుకో వీడియో ఫోటోలను షేర్ చేస్తూ .. మహేష్, సితార, గౌతమ్‌ల గురించి అభిమానులకు తెలిసేలా చేస్తున్నారు. మహేష్ సతీమణి నమృత.. తాజాగా ఆమె షేర్ చేసిన త్రో బ్యాక్ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. టెడ్డీ బేర్ పట్టుకుని పాట పాడుతూ మహేష్ తన కూతురు సితార పాపను నవ్విస్తున్న వీడియోను ఆమె షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.