సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో ప్రారంభం అయ్యింది. తాజాగా స్టార్టైన ఈ షూటింగ్ లో మహేష్ బాబు జాయిన్ అయ్యాడు. ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ సెట్స్ లో ఉండగా ఫోటో ఒకటి లీక్ అయ్యింది. ఆర్మీ డ్రెస్ లో మహేష్ బాబు అద్భుతంగా ఉన్నాడు. సీరియస్ గా సీన్ ను షూట్ చేస్తున్నట్టున్నారు. మహేష్ ఫేస్ సీరియస్ గా ఉన్నది.
సెట్స్ నుంచి లీకైనా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ఈ మూవీని పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.