సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో రావిపూడి ‘ఎఫ్ 2’ లాంటి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మహేష్ అతనికి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. వీరిద్దరి సినిమా జూన్ నెలలో అధికారికంగా లాంచ్ కానుంది. రెగ్యులర్ షూట్ జూలై నెలలో మొదలవుతుందట. ఈ సినిమా కూడా రావిపూడి గత చిత్రాల్లానే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత మహేష్ పూర్తిగా జానర్ మార్చి ఒక భిన్నమైన ఎటెంప్ట్ చేస్తుండటంతో ప్రేక్షకులు, అభిమానులు ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిగా ఉన్నారు.