HomeTelugu Trendingఆ 25 నిమిషాల్లో ఫ్యాన్స్ మెచ్చే, నచ్చేలా మహేష్‌ కనిపిస్తాడట!

ఆ 25 నిమిషాల్లో ఫ్యాన్స్ మెచ్చే, నచ్చేలా మహేష్‌ కనిపిస్తాడట!

6 10సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి చేసుకొని హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ట్రైన్ ఎపిసోడ్, రాయలసీమకు సంబంధించిన సీన్స్ ఈ షెడ్యూల్లో చిత్రీకరణ చేస్తారు. పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నాయని వినికిడి.

మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గెటప్ లో వీరోచిత పోరాటాలు ఉంటాయని, మహేష్ ఇంట్రో సీన్స్ కూడా అదిరిపోయే విధంగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ ఆర్మీ ఆఫీసర్ రోల్ మొత్తం మీద సినిమాలో 25 నిమిషాల పాటు ఉంటుందట. ఈ 25 నిముషాల ఎపిసోడ్ ఫ్యాన్స్ మెచ్చేలా, నచ్చేలా ఉంటుందని యూనిట్ చెప్తోంది. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది. 13 ఏళ్ల తర్వాత విజయశాంతి ఈ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!