పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. తాజా ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో సూపర్‌స్టార్ మహేష్ బాబు కొన్ని క్షణాల పాటు కనిపిస్తాడన్న న్యూస్ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది. కాగా మహేష్ ఇప్పటివరకు ఒక్క సినిమాలోనూ అతిథిపాత్రలో కనిపించలేదు.
దీంతో ఓజీ టీమ్ ఈ సినిమాలో మహేష్‌తో గెస్ట్‌లో చేయించాలి అని సన్నాహాలు చేస్తున్నారు. ఇది త్రివిక్రమ్ సలహానేనని ఇన్‌సైడ్ టాక్. ప్రస్తుతం గుంటూరు కారంతో బిజీగా ఉన్న మహేష్ మరీ ఈ క్యామియో రోల్ గురించి ఏమంటాడో చూడాలి. అయితే కొంత వరకు మాత్రం ఇదే పక్కా గాసిప్ అనే అంటున్నారు.
ఇప్పటికే.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సాలో మహేష్ వాయిస్ ఓవర్ ఇస్తేనే థియేటర్‌లు ఊగిపోయాయి. అలాంటిది వీరిద్దరూ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపిస్తారు అనే వార్తలు వినిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.