HomeTelugu Trendingస్టైలిష్‌లుక్‌లో మహేష్‌..వైరల్‌

స్టైలిష్‌లుక్‌లో మహేష్‌..వైరల్‌

Mahesh Babus stylish look
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన లుక్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటు ఉంటాడు. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని ది వెస్టిన్‌లో నిర్వహించిన కు హాజరయ్యాడు. మహేష్‌ బాబు ఈవెంట్‌లో గేమ్‌ ఛేంజర్స్ కాఫీ టేబుల్‌ బుక్‌ను ఆవిష్కరించాడు. మెరూన్‌ హుడీ, బ్లూ జీన్స్‌లో లాంగ్ హెయిర్‌స్టైల్‌తో వేదికపైకి వచ్చి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశాడు. ఎప్పుడూ కొత్త లుక్‌తో అదరగొట్టే మహేశ్ బాబు ఈ సారి కూడా సింపుల్‌ అండ్ స్లైలిష్‌ లుక్‌, వాక్‌తో ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ఇప్పుడీ ఫొటోలు, వీడియోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.

ప్రస్తుతం మహేష్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ డైరెక్షన్‌లో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌ ఏరియాలో కొనసాగుతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్‌ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే లాంఛ్ చేసిన గుంటూరు కారం మాస్ స్ట్రైక్‌ నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu