మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ గానీ, ఫోటోస్ కానీ ఏవి బయటకు రాలేదు. టైటిల్ గా కూడా కొన్ని పేర్లు వినిపించినప్పటికీ చిత్రబృందం అఫీషియల్ గా ఏది కన్ఫర్మ్ చేయలేదు. తాజాగా నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన విన్నర్ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న నిర్మాత పివిపి మాటలను బట్టి మహేష్ సినిమా టైటిల్ సంభవామి యుగే యుగే అని తెలుస్తోంది.
ఆయన మాట్లాడుతూ.. నిర్మాత మధు, మహేష్ సినిమాకు కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్మిస్తోన్న విన్నర్, మిస్టర్, సంభవామి యుగే యుగే చిత్రాలు ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలని అన్నారు. దీంతో అందరూ మహేష్ సినిమా టైటిల్ సంభవామి యుగే యుగే అని ఫిక్స్ అయిపోయారు. సినిమా టీం అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. మహేష్ టైటిల్ ఇదే అయి ఉంటుందని అభిమానులు చెప్పుకుంటున్నారు.