HomeTelugu Trendingమహేష్‌ బాబు వర్కౌట్ వీడియోలు వైరల్

మహేష్‌ బాబు వర్కౌట్ వీడియోలు వైరల్

Mahesh Fitness pics

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ చూపిస్తాడు. ఒక స్టార్ హీరో, యాక్షన్ హీరోకి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఫిట్‌నెస్. అందుకే ఎప్పుడూ వ్యాయామం చేస్తూ మహేశ్ నాజూగ్గా ఉంటాడు.

తన జిమ్ వర్కౌట్ల వీడియోలను మహేశ్ బాబు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటాడు. తాజాగా తాను ఎక్సర్ సైజ్ చేస్తున్న ఓ వీడియోను షేర్ చేశాడు.

ఇందులో తన ఫేవరెట్ ఎక్సర్ సైజ్ స్కిల్ మిల్‌తో వ్యాయామం చేసినట్లు చెప్పాడు. ఒక నిమిషం పాటు ల్యాండ్ మైన్ ప్రెస్సింగ్, ఒక నిమిషం పాటు కెటిల్ బెల్ స్వింగ్స్, ఒక నిమిషం పాటు స్కిల్ మిల్ రన్…” అంటూ పోస్టు చేశాడు.

వ్యాయామం ఏ క్రమపద్ధతిలో సాగిందీ మహేశ్ బాబు ఇన్ స్టాలో వివరించాడు. ఇదే ఆర్డర్‌లో మీరెంత సేపు వ్యాయామం చేయగలరు? అంటూ నెటిజన్లను కూడా ప్రశ్నించారు.

పోకిరి సినిమాలో మహేష్‌బాబు ఇంట్రడక్షన్ సీన్‌ను మరోసారి గుర్తుచేసినట్టుంది. స్కిల్‌మిల్‌పై మహేష్ పరుగెత్తిన తీరు అలాగే ఉంది. అభిమానులు కూడా ఆ పరుగేంటి సామీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం మహేష్‌బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం మూవీ చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన షెడ్యూల్ ఒకటి హైదరాబాద్‌లో షూట్ చేశారు. త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి మూవీ ప్రారంభం కానుంది.

https://www.instagram.com/reel/CuJl1OGsXPq/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

Recent Articles English

Gallery

Recent Articles Telugu