సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. దీని తర్వాత మహేష్ చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ మూవీ చేయనున్నాడు. ఇదే క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా.. తాజాగా కోలీవుడ్ డైరెక్టర్ లేడీ డైరెక్టర్ సుధ కొంగర కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
‘గురు’ (సాలా ఖడూస్) సినిమాతో దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధా కొంగర.. ఇటీవల సూర్య హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’ (సూరారై పొట్రు) సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకుంది. ఈ క్రమంలో ప్రేక్షకుల మన్ననలతో పాటుగా విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఇటీవల మహేష్ బాబుకు సుధా కొంగర ఓ కథ వినిపించారట. స్క్రిప్ట్ లోని కొత్తదనం నచ్చడంతో మహేష్ నుంచి మంచి స్పందన వచ్చిందని అంటున్నారు. దీనిపై ప్రకటన రావల్సి ఉంది.