ఎప్పుడూ బిజీగా ఉండే హీరోలు లాక్‌డౌన్ కారణంగా ఖాళీ అయిపోయారు. ఈ కరోనా టైంలో వారు తమ కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. పండుగలాంటి వాతవరణాని క్రీయేట్ చేసుకుంటున్నారు.. ముఖ్యంగా కుటుంబం అంటే ప్రాణమిచ్చేవారు. అటువంటి వారిలో మహేష్ బాబు ఒకరు. కరోనా ఇచ్చిన అనుకోని సెలవులను అదిరిపోయేలా వాడుకుంటున్నాడు మన సూపర్ స్టార్. కాలు కూడా బయటికి పెట్టకుండా సెలబ్రిటీస్ అంతా ఆదర్శంగా నిలుస్తున్నారు. అందులో ముఖ్యంగా మహేష్ బాబు అయితే రోజూ తన టైమ్ టేబుల్ కూడా సెట్ చేసుకున్నాడు. ఈ లాక్‌డౌన్ రోజులు ఏం చేయాలనేది కూడా ఈయన ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. అందులో పిల్లలతో ఆడుకోవడం కీలకం.
ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు మహేష్ బాబు. షూటింగ్స్ సమయంలో ఆయనకు పిల్లలతో గడిపే సమయం దొరకదు.. అందుకే ఈ కరోనా తీసుకొచ్చిన హాలీడేస్‌ను పూర్తిగా పిల్లలకే ఇచ్చేసాడు మహేష్. ప్రస్తుతం పిల్లలు సితార, గౌతమ్‌లతో మహేష్ బాబు ఆడుకుంటున్నాడని.. అలాగే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏవీ వదలకుండా చూస్తున్నాడని తెలిపింది మహేష్ బాబు భార్య నమ్రత. అన్నింటికంటే ముఖ్యంగా సితార అయితే తండ్రిని ఒక్క క్షణం కూడా వదలడం లేదని చెబుతుంది. ఇప్పుడు కూడా క్వారంటైన్ నైట్స్ అంటూ తన కూతురుతో ఆడుకుంటున్న ఫోటో పోస్ట్ చేసాడు మహేష్.
రోజూ పొద్దున్నే లేవడం.. పిల్లలతో ఆడుకోవడమే మహేష్ బాబుకు సరిపోతుంది. సితార పాపతోనే ఆడుకుంటున్న ఫోటోలు పోస్ట్ చేస్తున్నాడు మహేష్. దాంతోపాటు కొడుకు గౌతమ్‌తో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నాడు.