నందమూరి బాలకృష్ణ 60వ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. ‘ఎనర్జీకి బాలకృష్ణ పవర్ హౌస్‌లాంటి వారు. ఆయన నటన పట్ల నేను ఎల్లప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఆయనకు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన జీవితాంతం ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అని మహేశ్ బాబు ప్రశంసలు చేశాడు. కాగా, బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలవురు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
To the powerhouse of energy, an actor I’ve always admired… Happy 60th Balakrishna garu. Wishing you the best of health and happiness always 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) June 10, 2020