HomeTelugu Big Storiesఅటువంటి వారికి దూరంగా ఉండండి.. కరోనాపై మహేష్‌ ట్వీట్‌

అటువంటి వారికి దూరంగా ఉండండి.. కరోనాపై మహేష్‌ ట్వీట్‌

7 6
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు.. కరోనా వైరస్‌, దాని గురించి వస్తోన్న వార్తలను ఉద్దేశించి ఆయన మంగళవారం ట్వీట్లు చేశాడు. భౌతికదూరం, పరిశుభ్రతతోపాటు మరొకటి పాటించాలని నెటిజన్లను కోరాడు.

‘దీన్ని ప్రతిఒక్కరు చదవాలని.. ప్రేమ, ఆశల్ని, పాజిటివిటీని వ్యాప్తి చేయాలని కోరుతున్నా. మనమంతా కలిసి ఈ తుఫానుతోపాటు ప్రయాణం చేస్తున్నాం. దూరం (social distancing) పాటించడం, పరిశుభ్రంగా ఉండటంతోపాటు (good hygiene) మరో ముఖ్య విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. అదే భయాన్ని దూరంగా ఉంచడం (Fear Distancing).. ఆందోళన, భయాన్ని కలిగించే వ్యక్తులకు, వార్తలకు దూరంగా ఉండండి. తప్పుడు వార్తల పెద్ద సమస్యగా మారాయి. తప్పుదారిపట్టించే సమాచారానికి దూరంగా ఉండండి’.

‘లాక్‌డౌన్‌ విధించి రెండు వారాలు అవుతోంది. మనం చాలా బలంగా ముందుకు వెళ్తున్నాం. ఐకమత్యంగా పనిచేస్తోన్న మన ప్రభుత్వాలను ప్రశంసించాలి. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఈ సందర్భంగా మనమంతా ఆరోగ్యంగా ఉండేందుకు కొవిడ్‌-19తో పోరాడుతూ ముందు వరసలో నిల్చున్న వారికి ధన్యవాదాలు చెబుదాం. వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టి మన కోసం పోరాడుతున్న యోధులను గౌరవిద్దాం. మీ అందరికీ ఆ దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి’ అని ట్వీట్లు చేశాడు మహేష్‌ బాబు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu