ఇస్రో ప్రయోగించిన ‘చంద్రయాన్ 2’ అనుకున్నట్టుగా జరిగి ఉంటె ఈ ఉదయాన్నే చంద్రునిపై ల్యాండ్ అయ్యి ఉండేది. కానీ, చివరి నిమిషంలో అనుకోని అవాంతరాలు ఎదురుకావడంతో మరో 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండ్ కావాల్సి ఉండగా సిగ్నల్స్ ను కోల్పోయింది. సిగ్నల్స్ ను కోల్పోవడంతో.. ల్యాండర్.. ఆర్బిటర్.. కంట్రోల్ రూమ్ కు మధ్య సంబంధాలు తెగిపోయాయి. దీంతో శాస్త్రవేత్తలు డీలా పడ్డారు. దేశం యావత్తు ఇస్రో వెన్నంటే నిలిచింది. నాయకుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరు ట్వీట్ చేస్తూ అండగా నిలిచారు.
ఈ లిస్ట్ లో టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు కూడా ఉన్నారు. ఇస్రో చేసిన ప్రయోగం గురించి.. చంద్రయాన్ 2 గురించి మహేష్ బాబు హార్ట్ టచ్ చేసే ట్వీట్ చేశారు. “సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినీ.. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ.. ‘చంద్రయాన్ 2’ తో ఇస్రో చారిత్రాత్మక ప్రయాణం మొదలుపెట్టింది. చంద్రయాన్ 2 కోసం పనిచేసిన ప్రతి ఒక్క శాస్త్రవేత్తకు సెల్యూట్ చేస్తున్నా.. మీరే నిజమైన హీరోలు.. మీవెంటే మేమంతా” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహేష్ తో పాటు చాలామంది సెలెబ్రిటీలు ఇస్రో కు అండగా ఉన్నారు.
Success is not a destination, it's a journey & @isro had a historical journey with #Chandrayaan2. I salute each & every scientist working on this project🙏You are our real heroes & we are with you. This is just the beginning of your success story. Way to go🙌#MissionMoon
— Mahesh Babu (@urstrulyMahesh) September 7, 2019