HomeTelugu Trendingధనుష్‌కి మహేష్‌ ట్వీట్‌.. ఫ్యాన్స్‌ ఫిదా.. వైరల్‌

ధనుష్‌కి మహేష్‌ ట్వీట్‌.. ఫ్యాన్స్‌ ఫిదా.. వైరల్‌

3 20టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌.. మహేష్ బాబు ఇటీవల కాలంలో ఇతర హీరోల సినిమాలు చూస్తున్నారు. సినిమా బాగుంది అనే తప్పనిసరిగా ట్వీట్ చేసి శుభాకాంక్షలు చెప్తున్నాడు. మహేష్ ట్వీట్ చేయడం వలన సినిమాకు ప్లస్ అవుతుంది అనడంలో సందేహం లేదు. తాజగా ఈ లిస్ట్ లో ధనుష్ కూడా చేరిపోయారు. ధనుష్ హీరోగా చేసిన అసురన్ సినిమా తమిళంలో దుమ్ము రేపుతున్నది. కులవివక్ష, భూమికి సంబంధించిన తగాదాల నేపథ్యంలో సినిమా తీశారు.

ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాను ఇటీవలే చూసిన మహేష్ బాబు.. హీరో ధనుష్, డైరెక్టర్ వెట్రి మారన్ కు శుభాకాంక్షలు తెలిపాడు. ధనుష్ సినిమా బాగుందని ట్వీట్ చేయడంతో.. ధనుష్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మహేష్ బాబు పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు మహేష్ బాబు ట్వీట్ తమిళనాడులో వైరల్ అవుతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu