HomeTelugu Trendingరామ్‌ చరణ్‌ సినిమాకి నిర్మాతగా మహేష్‌?

రామ్‌ చరణ్‌ సినిమాకి నిర్మాతగా మహేష్‌?

3 28
సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన ‘మహర్షి’ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడో మరో సారి మహేష్‌ ఆయనతో మరో సినిమా చేయాలనుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన కుదరలేదు. దాంతో పరశురామ్ తో సెట్స్ పైకి వెళ్లడానికి మహేశ్ బాబు సిద్ధమవుతున్నాడు. అయితే వంశీ పైడిపల్లి తన కోసం రెడీ చేసిన కథను మహేశ్ పట్టించుకోకుండా వదిలేయలేదు.

ఆ కథకి చరణ్ సెట్ అవుతాడనీ, ఆయనను ఒప్పిస్తే తాను నిర్మిస్తానని వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు అన్నాడట. గతంలో ‘ఎవడు’ సినిమాతో చరణ్ కి హిట్ ఇచ్చిన కారణంగా, ఆయనతో వంశీ పైడిపల్లికి ఎంతో సాన్నిహిత్యం వుంది. దాంతో చరణ్ కి వంశీ పైడిపల్లి ఆ కథను వినిపించడం, ఆ కథకి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ సినిమాకి చరణ్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu