మల్టీస్టారర్ సినిమాలకు తెలుగులో ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరిగిపోతుంది. కథ నచ్చితే మన హీరోలు కూడా ఇగోలు.. ఇమేజ్‌లు పక్కనబెట్టి కలిసి నటిస్తున్నారు. కొన్నేళ్లుగా మల్టీస్టారర్ ట్రెండ్ పెరిగిపోయింది. ఇప్పుడు కూడా రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ కూడా రాబోతుందని తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేగంగా జరుగుతుంది. ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కానుంది. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథి గెస్ట్ రోల్‌లో నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. వరస విజయాల మీద ఉన్న ఆయన ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ మధ్యే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. కాగా ఈయన కొరటాల సినిమాలో అతిథి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. చిరంజీవిపై ఉన్న గౌరవం.. కొరటాలపై ఉన్న అభిమానం, చరణ్‌తో ఉన్న స్నేహం కారణంగా ఈ గెస్ట్ రోల్ చేయడానికి మహేష్ ఒప్పుకున్నాడని వార్తలు
వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కోసం త్వరలోనే కొన్ని రోజులు డేట్స్ ఇవ్వనున్నాడు సూపర్ స్టార్. దాంతో పాటే చిరు, మహేష్ కాంబినేషన్ సీన్స్ కూడా అదిరిపోతాయని.. సూపర్ స్టార్, మెగాస్టార్ కలయిక అభిమానులకు పండగే అంటున్నారు.