HomeTelugu Big Storiesఅభిమానులకు మహేష్‌ సమాధానాలు..

అభిమానులకు మహేష్‌ సమాధానాలు..

5
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు ఆసక్తికర విషయాలు తెలిపాడు. తాజాగా ఆయన సోషల్‌ మీడియా ద్వారా అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఎవరి మీదైనా మనసుపడ్డారా? (ఎవరి మీదైనా క్రష్‌ ఉందా?) అంటూ ఒకరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాడు. తనకు 26 ఏళ్ల వయసున్నప్పుడు ఓ అమ్మాయి మీద మనసుపడ్డానని చెప్పాడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకున్నానని, ఆమే తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అని, ఆమె ఎవరో కాదు నమ్రత అని చెప్పాడు.

కాగా, తన పిల్లలు గౌతమ్‌, సితారల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టమని ఒకరు అడగగా వారిద్దరూ తనలో భాగమని, ఇద్దరూ ఒకటేనని చెప్పాడు. భవిష్యత్తులో తన కుమారుడు గౌతమ్‌ హీరో అవుతాడా? అన్న ప్రశ్నకు మహేశ్ స్పందిస్తూ.. వాడికి హీరో అవ్వాలని ఉందనుకుంటున్నానని, అయితే, ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుందని చెప్పాడు.

ఇంకా.. ఓ అభిమాని ‘ మీ ఫేవరేట్ కలర్ అండ్ ఫుడ్ ఏమిటి ? అని అడగగా.. ‘నా ఫేవరేట్ కలర్ బ్లూ, నాకు ఇష్టమైన ఫుడ్ మన సంప్రదాయ హైదరాబాద్ బిర్యానీ’ అని మహేష్ అన్నారు. అలాగే మరో అభిమాని ‘మీకు బాగా ఇష్టమైన గేమ్ ఏమిటి సార్.. అని అడగగా.. ‘నేను బాగా ఎంజాయ్ చేసేది ఆన్ లైన్ లో మా అబ్బాయి గౌతమ్ తో ఆడే టెన్నిస్, బేస్ బాల్, గోల్ఫ్’ అని అన్నారు. భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? మేం ఎదురుచూస్తున్నాం అని మరో ప్రశ్న అడగ్గా.. ఖచ్చితంగా ఆయన దర్శకత్వంలో నటిస్తాను. నాకు ఇష్టమైన డైరెక్టర్‌ల్లో పూరీ ఒకడు. ఆయన కథ నరేట్‌ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నా అని పేర్కోన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu