HomeTelugu Trendingకమల్‌హాసన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మహేష్‌ బాబు

కమల్‌హాసన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మహేష్‌ బాబు

Mahesh Babu thanks to Kama

దివంగత నటుడు, సూపర్‌ స్టార్ కృష్ణ చ‌నిపోయి న‌వంబ‌ర్ 15తో ఏడాది పూర్తి అవుతుంది. ఈ నేప‌థ్యంలో కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం నేడు విజయవాడలో ఘనంగా జ‌రిగింది. విజయవాడలోని గురునానక్‌ కాలనీలోని ఏర్పాటు చేసిన విగ్రహాన్ని లెజెండ‌రీ న‌టుడు కమల్‌హాసన్‌ శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు.

ఇక ఈ వేడుక‌ను విజయవాడ వైసీపీ లీడర్ దేవినేని అవినాష్ దగ్గరుండి జరిపించారు. ఈ కార్యక్రమంలో ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌తో పాటు కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులు పాల్గొన్నారు. అయితే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంపై తాజాగా సూపర్‌ స్టార్ మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

నాన్న గారి విగ్రహం ఆవిష్కరించినందుకు కమల్‌హాసన్ సార్, దేవినేని అవినాష్‌ల‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లినా.. ఒక అభిమాని కుటుంబాన్ని మా సొంతం చేసి వెళ్లారు. ఈ ఈవెంట్‌ను విజ‌యవంతం చేసిన అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ మ‌హేష్ రాసుకోచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu