టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘క్వికాన్ పేమెంట్స్ యాప్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి మహేశ్ బాబును బాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర ప్రశ్న అడిగారు. బాలీవుడ్ లో నేరుగా ఏదైనా హిందీ సినిమా చేసే అవకాశం ఉందా? ఆ ప్రాజెక్టు ఎప్పుడు ఉంటుంది? అని ప్రశ్నించారు.
అందుకు మహేశ్ బాబు సమాధానం ఇస్తూ.. “హిందీ చిత్రాలు చేయాల్సిన అవసరం ఏముంది? తెలుగులో నటిస్తున్నాను కదా… ఇప్పుడు తెలుగు చిత్రాలను ప్రపంచమంతా చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతోంది అదే. అలాంటప్పుడు నువ్వైనా సరే తెలుగు సినిమాలు చేస్తే చాలనుకుంటావు” అని తన అభిప్రాయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాల్లో సందడి చేస్తోంది.
Mahesh Babu Reply To Media About His Bollywood Entry. pic.twitter.com/T8iJlJ1487
— Naveen MB Vizag 🔔 (@NaveenMBVizag) April 6, 2022