HomeTelugu Big Storiesటీవీ లో 1500 సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డు సృష్టించిన Mahesh Babu సినిమా ఏదంటే

టీవీ లో 1500 సార్లు ప్రసారమై వరల్డ్ రికార్డు సృష్టించిన Mahesh Babu సినిమా ఏదంటే

Mahesh Babu starrer sets World Record with 1500 TV Telecasts
Mahesh Babu starrer sets World Record with 1500 TV Telecasts

Mahesh Babu World Record:

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు టీవీలో ఎంత క్రేజీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ఆయన నటించిన ఓ సినిమా 1500 సార్లు టెలికాస్ట్ అవ్వడం అక్షరాలా రికార్డు!

2005లో విడుదలైన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అతడు’ బాక్సాఫీస్ వద్ద అంతగా విజయవంతం కాలేదు. కానీ కాలక్రమంలో అది క్లాసిక్‌గా మారిపోయింది. మహేష్ బాబు స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, కంఫర్ట్ వాచ్ ఫీలింగ్ – ఇవన్నీ కలిసి దీన్ని టీవీ ఆడియెన్స్ ఫేవరెట్ మూవీగా మార్చేశాయి.

సాధారణంగా పెద్ద హిట్ సినిమాలు కూడా 1000 సార్లు ప్రసారమవుతే చాలా గొప్పగా భావిస్తారు. కానీ స్టార్ మా లో ‘అతడు’ ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అయింది! ఇది తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారి. ఇప్పటికీ ఎప్పుడైతే ఈ సినిమా టీవీలో వస్తుందో, మంచి TRP రేటింగ్ వస్తుంది.

స్టైలిష్ యాక్షన్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ప్లే, మహేష్ బాబు పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ డైలాగ్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, ప్రతి వయస్సు వాళ్లకూ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, క్వాలిటీ సినిమాటోగ్రఫీ, హై స్టాండర్డ్స్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్స్.

OTTలు వచ్చినా, సినిమాలేను థియేటర్లలో చూద్దామని అనుకున్నా, కొన్ని సినిమాలకు మాత్రం టీవీలోనూ అదే క్రేజ్ ఉంటుంది. ‘అతడు’ ఆ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇంతటి ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు ఇంకా ప్రేక్షకాదరణ తగ్గడం లేదు!

Recent Articles English

Gallery

Recent Articles Telugu