HomeTelugu Trendingమేకప్ మేన్‌కి బర్త్‌డే విషెస్ చెప్పిన మహేష్‌.. నెటిజన్ల ప్రసంశలు

మేకప్ మేన్‌కి బర్త్‌డే విషెస్ చెప్పిన మహేష్‌.. నెటిజన్ల ప్రసంశలు

4 6
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు ఎంత ఎదిగిన సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రెస్ గా ఉంటాడు. తాజాగా మహేష్ తన మేకప్ మెన్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పట్టాభి అనే మేకప్ మెన్ ఎప్పటి నుండో మహేష్‌కి పర్సనల్ మేకప్ మెన్‌గా పని చేస్తుండగా, ఆయన బర్త్‌డేని గుర్తు పెట్టుకొని విష్ చేయడంతో అభిమానులు మహేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

“హ్యాపీ బర్త్‌డే పట్టాభి. షూటింగ్‌ మొదలైనప్పటి నుండి లాస్ట్ టచ్ అప్ వరకు నాతో ఉండే నువ్వు ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ” అంటూ.. మహేష్ అతనితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ విషెస్ అందించారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో వేరే స్టార్లకు శుభాకాంక్షలు తెలిపాడంటే ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. కానీ మేకప్ మెన్ పుట్టినరోజుకు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం ప్రశంసించాల్సిన విషయమే. మహేష్ వద్ద మేకప్ మెన్ గా పట్టాభి గత కొన్నేళ్లుగా పని చేస్తున్నాడట. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చెబుతోంది మహేష్ బాబు మనసు ఏమిటో అని అభిమానులు, నెటిజన్లు ప్రసంశలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu