HomeTelugu Trendingతిరుమలలో 'సరిలేరు నీకెవ్వరు' బృందం

తిరుమలలో ‘సరిలేరు నీకెవ్వరు’ బృందం

11 7
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విజయవంతం కావడంతో చిత్రబృందం మంచి జోష్‌లో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు చిత్ర బృందం గురువారం తిరుమల వెళ్లింది. హైదరాబాద్‌ నుంచి రేణిగుంట విమానశ్రయం చేరుకున్న చిత్రబృందంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.

అక్కడి నుంచి వారు రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లారు. తిరుమల వెళ్లినవారిలో మహేష్‌ బాబు, నమ్రత, వారి పిల్లలు, విజయశాంతి, దిల్‌ రాజు, అనిల్‌ రావిపూడి, రాజేంద్రప్రసాద్‌, అనిల్‌ సుంకర, వంశీ పైడిపల్లి ఉన్నారు. రేపు వేకువజామున సరిలేరు నీకెవ్వరు చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu