టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీకారం’. అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా లిరికల్ సాంగ్స్, పోస్టర్స్ ఇప్పటికే విడుదల కాగా అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా మార్చ్ 11న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం చిత్రబృందం ప్రకటించింది. రేపు సాయంత్రం 4:05 కు శ్రీకారం టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయనున్నట్లుగా పోస్టర్ ద్వారా తెలిపింది. ఈ సినిమాతో కిషోర్ రెడ్డి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఫస్ట్ టైం శర్వానంద్ వ్యవసాయం నేపథ్యంతో సినిమా చేస్తున్నాడు. 14రీల్స్ పతాకం పై రామ్ అచంట గోపి అచంట నిర్మిస్తున్నారు.