HomeTelugu Trendingవెంటనే చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి: మహేష్‌

వెంటనే చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి: మహేష్‌

Mahesh babu react on saidab

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అని అధికారులను మహేష్ కోరారు. ‘ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణం సమాజంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో గుర్తు చేస్తున్నాయి. అసలు మన బిడ్డలు సురక్షితమేనా? అన్నది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోవాలా! చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఖంలో మునిగిపోయిందో ఊహించలేం’ అంటూ మహేశ్‌ ఎంతో ఎమోషనల్‌ అయ్యారు.

హీరో మంచు మనోజ్‌ సైతం బాలిక హత్యాచారం కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మనోజ్‌.. ఈ దారుణ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని పిలుపునిచ్చాడు. కాగా సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu