దివంగత నటుడు ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభమైయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్కినేని నాగేశ్వర్‌రావు విగ్రహాన్ని ఆవిష్కరించారని తెలిసిందే.
ఈ వేడుకలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాగా.. ఓ పిక్ మాత్రం వైరల్‌గా మారింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ చాలా కాలం తర్వాత ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. రాంచరణ్‌కు మహేశ్ బాబు మాట్లాడుకుంటుండగా.. మధ్యలో నమ్రతా శిరోద్కర్ చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది.
సాధారణంగా స్టార్ హీరోలు ఎప్పుడో కానీ ఇలా ఒక్క చోట హ్యాపీ మూడ్‌లో కనిపించడం చాలా అరుదు. ఇప్పుడు మహేశ్ బాబు, రాంచరణ్ స్టిల్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో వారి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు అక్కినేని కుటుంబసభ్యులు హజరైయ్యారు.
మరియే టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మురళీమోహన్, జయసుధ, మోహన్‌బాబు, శ్రీకాంత్, జగపతిబాబు, రామ్ చరణ్, రాజేంద్రప్రసాద్, మహేశ్ బాబు, రానా, విష్ణు, నాని, దిల్ రాజు, రాజమౌళి, న్యాచురల్ స్టార్ నాని, కీరవాణితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.