HomeTelugu Trendingసుధీర్‌ నటనపై మహేశ్‌బాబు ప్రశంసలు

సుధీర్‌ నటనపై మహేశ్‌బాబు ప్రశంసలు

Mahesh babu praises on srid

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తన బావ, హీరో సుధీర్‌ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ చిత్రంలో సుధీర్‌ నటన అద్భుతంగా ఉంది అన్నారు. శుక్రవారం సాయంత్రం స్పెషల్‌గా ఈ చిత్రాన్ని వీక్షించిన మహేశ్‌.. తాజాగా ట్విటర్‌ వేదికగా సినిమాపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. చిత్రబృందంలోని ప్రతి ఒక్కర్నీ పేరు పేరునా అభినందించారు. మిస్‌ కాకుండా అందరూ ఈ చిత్రాన్ని వీక్షించాలన్నారు.

క్లిష్టతరమైన క్లైమాక్స్‌తో అద్భుతమైన ప్రేమకథా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ‘పలాస 1978’ తర్వాత కరుణకుమార్‌ మరోసారి సామాజిక కోణంలో చిత్రాన్ని తెరకెక్కించిన విధానం బాగుంది. సుధీర్‌ అద్భుతంగా నటించాడు. ఇప్పటివరకూ వచ్చిన సినిమాలతో పోలిస్తే ‘సూరిబాబు’ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు బాగుంది. నరేశ్‌ మరోసారి తన నటనతో మెప్పించేశారు. ఆనంది గురించి ప్రత్యేకంగా చెప్పాలి. శ్రీదేవి పాత్రకు ఆమె పర్‌ఫెక్ట్‌గా సరిపోయారు. విజువల్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగున్నాయి. ఈ చిత్రాన్ని మిస్ కాకండి. చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు’ అని మహేశ్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రానికి కరుణ కుమార్‌ దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించారు. 70 ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!