HomeTelugu Trendingకూతురు కన్నా గొప్ప బహుమతి లేదు: మహేష్‌ బాబు

కూతురు కన్నా గొప్ప బహుమతి లేదు: మహేష్‌ బాబు

Mahesh babu post on internసూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు కన్నా గొప్ప బహుమతి ఇంకేమీ లేదు అని అంటున్నారు. ఈ సృష్టిలో ఆడ-మగ సమానమేనని చెబుతూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆడపిల్లలు దృఢంగా ఉండాలని, తమ కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడాలని సూచించారు. నేడు ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే (అంతర్జాతీయ ఆడపిల్ల దినోత్సవం) సందర్భంగా సితార ఫొటోనూ షేర్ చేస్తూ ఈ పోస్ట్ చేశారు మహేష్ బాబు.

‘కూతురు కన్నా గొప్ప బహుమతి ఇంకేమీ లేదు! తన చిన్ని ప్రపంచాన్ని స్వయంగా నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తోన్న నా చిన్నారిని చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను. మీ కలలను నిర్లక్ష్యం చేయొద్దు, మీ గొంతును వినిపించడండి. దృఢంగా ఉండండి. మీకు ఏది సరైనదో దాని గురించి పోరాడండి. సమానత్వంతో కూడిన ప్రపంచాన్ని మనం ఏర్పరుచుదాం. నా చిన్నారి పాపతో పాటు ఈ ప్రపంచంలో ఉన్న బాలికలంతా సెలబ్రేట్ చేసుకుంటోన్న రోజు ఇది.. ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే’’ అని మహేష్
బాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu