సూపర్ స్టార్ మహేశ్ బాబును గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన షూటింగులు లేని సమయంలో ఆయన తన ఫ్యామిలీతోనే గడుపుతుంటారు. ఏడాదికి కుటుంబంతో కలిసి రెండు, మూడు ఫారిన్ టూర్లు వేస్తుంటారు.
మరోవైపు తల్లిదండ్రులు, అన్నను కోల్పోయిన బాధ నుంచి ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మరోవైపు త్వరలోనే మహేశ్ బాబు ఇంట్లో ఒక శుభకార్యం జరగనుంది. తన తల్లి కోరిక మేరకు ఆ శుభకార్యాన్ని నిర్వహించాలని మహేశ్ బాబు నిర్ణయించారు.
మహేశ్ బాబు కూతురు సితార లంగా ఓణీ ఫంక్షన్ ను చేయాలి మహేశ్ బాబు నిర్ణయించారు. ఈ ఫంక్షన్ ను చూడాలని మహేశ్ తల్లి ఇందిరాదేవి బతికున్నప్పుడు అనుకున్నారట. అయితే, ఈ వేడుకను చూడకుండానే ఆమె కన్నుమూశారు. దీంతో, తన తల్లి కోరికను తీర్చాలని మహేశ్ డిసైడ్ అయ్యారు. ఈ ఫంక్షన్ కు ఘట్టమనేని కుటుంబ సభ్యులందరూ హాజరుకానున్నారు.