సూపర్ స్టార్ మహేష్ బాబు గత మూడేళ్ళుగా సోషల్‌మీడియాలో డిస్‌ప్లే, ప్రొఫైల్ ఫిక్‌ను సెంటిమెంట్‌గా భావించి ఒకే ఫోటోను మెయింటైన్ చేస్తున్నాడు. అయితే తాజాగా మహేష్‌బాబు తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ డీపీని మార్చాడు. ఇటీవల పాల్గొన్న నైక్ కంపెనీ షోటోషూట్‌లో పాల్గొన్న పిక్‌ను తన డిస్‌ప్లే పిక్చర్‌గా పెట్టుకున్నాడు. దీంతో పాటు కవర్‌పేజ్, హెడర్‌గా కూడా బ్లూ టీషర్ట్ వేసుకుని క్లీన్ షేవ్‌తో మ్యాన్లీగా కనిపిస్తున్న ఓ ఫోటోను అప్‌డేట్ చేశాడు. మహేష్ ఇటీవలే ట్విట్టర్‌లో 10 మిలియన్స్ ఫాలోవర్స్‌ను సాధించాడు. మహేష్ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్.